Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: తెలంగాణ గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం అన్నిచర్యలుతీసుకుంటుందని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తూ అన్నారు. శుక్రవారం శేరిలింగంపల్లిలోనినల్లగండ్లలో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో సీఎంఎస్టిఈఐ పధకం కింద మంజూరైన గ్రీన్ బ్లిస్స్టోర్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజనుల సమగ్ర ఆర్ధిక, పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. ట్రైకార్ ద్వారా వివిధ వినూత్న పధకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. అందులో భాగంగానే సీఎం ఎస్టీ ఎంపవర్మెంట్ పథకం కింద విస్లావత్ దశరత్కు 60లక్షల యూనిట్ విలువతో గ్రీన్ బ్లిస్ స్టోర్ ఏర్పాటుకు ఆర్ధిక సహాయం అందించినట్టు తెలిపారు. సీఎంఎస్టిఈఐ పధకం కింద లబ్ది పొందిన ఎస్టీ పారిశ్రామిక వేత్తలు దాదాపు ప్రతియూనిట్ ద్వారా 10 మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారని అఆ్నరు. ఈపధకం ద్వారా గిరిజన ప్రాంతాల్లో వ్యవసాయం, అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు గిరిజన యువత మొగ్గుచూపుతున్నదని తెలిపారు.