Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ క్రిస్ కెయిన్స్ ఆరోటిక్ డిసెక్షన్ తో బాధ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన సిడ్నీలోని సెయింట్ విన్సెంట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఆక్సిజన్ సపోర్ట్ పై ఉన్నారు. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. కెయిన్స్ కు వెంటిలేటర్ ను తొలగించామని చెప్పారు. కెయిన్స్ ప్రస్తుత వయసు 51 ఏళ్లు. అంతర్జాతీయ క్రికెట్లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్ కు ప్రాతినిధ్యం వహించారు. తన 17 ఏళ్ల కెరీర్లో 62 టెస్టులు, 215 వన్డేలు ఆడారు. టెస్టుల్లో 3,320 పరుగులు చేయడంతో పాటు 218 వికెట్లు తీశారు. వన్డేల్లో 4,950 రన్స్ చేయడంతో పాటు 201 వికెట్లు పడగొట్టారు. కెయిన్స్ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్ చేసేవారు.