Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత ఏడాది ఆగస్టులో ఏకంగా రూ.56 వేల పీక్ స్థాయిని తాకిన బంగారం ధరలు ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. అయితే గత కొన్ని రోజులుగా పసిడి ధరలు మళ్లీ పెంపు బాటపట్టాయి. రోజూ ఎంతోకొంత పెరుగుతూ దేశ రాజధాని ఢిల్లీలో తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ.46,353కు చేరింది. క్రితం ట్రేడ్లో తులం 24 క్యారట్ బంగారం ధర రూ.46,225 వద్ద ముగిసింది. అయితే, వెండి ధరలు మాత్రం ఢిల్లీ మార్కెట్లో స్థిరంగా ఉన్నాయి. ఇవాళ కిలో వెండి దర కేవలం రూ.6 పెరిగి రూ.60,897కు చేరింది. క్రితం ట్రేడ్లో కిలో వెండి ధర రూ.60,891 వద్ద ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ కూడా ఇరవై పైసలు బలహీనపడి రూ.74.44 కు చేరింది. ఇక అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర రూ.1,786, ఔన్స్ వెండి ధర రూ.23.23 అమెరికన్ డాలర్లు పలికింది.