Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ లో నేతల మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. పీసీసీలో తమకు పదవి దక్కలేదని ఇద్దరు సీనియర్ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. కొత్తగా పదవులు దక్కిన నేతలు జోష్ లో కనిపిస్తున్నారు. నిజామబాద్ జిల్లా కాంగ్రెస్ లో సీనియర్ నేతల అలక హాట్ టాఫిక్ గా మారింది. జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, మాజీ ఎంపీ మధుయాష్కీ ప్రచార కమిటీ ఛైర్మన్ గా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. దీంతో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును ఆశించిన ఇద్దరు మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డీ, షబ్బీర్ అలీ కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. మహేష్ కుమార్ డౌడ్, మధుయాష్కీ పార్టీ బాధ్యతులు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు వచ్చినప్పుడు పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సన్మాన సభకు ఇద్దరు మాజీ మంత్రులు హాజరు కాలేదు.