Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గుంటూరులో విషాద ఘటన జరిగింది. సీతానగరం వద్ద కృష్ణానదీ పుష్కర్ఘాట్లో ఈతకు వెళ్లి మునిగి ఇంటర్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. గుంటూరుకు చెందిన ఇంటర్ విద్యార్థి నవీన్ ఇవాళ సాయంత్రం తన ముగ్గురు స్నేహితులతో కలిసి కృష్ణానదిలో ఈత కొట్టేందుకు దిగాడు. ఈత కొడుతుండగా ప్రవాహ ఉధృతిలో నవీన్ నీట మునిగి గల్లంతయ్యాడు. మిగిలిన ముగ్గురు సురక్షితంగా ఒడ్డుకు చేరారు. సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాలింపు చేపట్టి నవీన్ మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.