Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు లింక్-2 పనుల్లో భాగంగా దేవికొండ శివారులో పైపులైన్ విస్తరణ పనుల్లో భాగంగా పైపులకు వెల్డింగ్ చేస్తున్న కార్మికుడు సందీప్ (27) మృతి చెందాడు. ఎస్ఐ అశోక్ తెలిపిన వివరాల ప్రకారం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం దేవరియా జిల్లా మల్పువా గ్రామానికి చెందిన సందీప్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం పైపులకు వెల్డింగ్ చేస్తున్న క్రమంలో మట్టిదిబ్బలు అతనిపై కూలడంతో మట్టిదిబ్బల కింద కూరుకుపోయాడు. సమీపంలో పనులు చేస్తున్న తోటి కార్మికులు అప్రమత్తమై క్రేన్ సహాయంతో బయటకు తీసి అంబులెన్స్‌లో జగిత్యాల ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. మల్యాల సీఐ రమణమూర్తి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.