Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వేములవాడ శ్రీరాజరాజేశ్వర క్షేత్రంలో శ్రావణ సందడి కొనసాగుతోంది. శ్రావణమాసం రెండో శుక్రవారం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని, రాజరాజేశ్వరీదేవి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కులు చెల్లించుకున్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో భక్తులు కుంకుమపూజలలో పాల్గొన్నారు. కొవిడ్ కారణంగా లఘుదర్శనం అమలు చేస్తుండడంతో పాటు ఏడాదిన్నర కాలంగా గర్భాలయంలోకి భక్తులను అనుమతించడం లేదు.