Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఇటీవల భారత యువ ఆటగాడు ఉన్ముక్త్ చంద్ భారత క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. విదేశీ లీగ్ ల్లో ఆడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అతను తెలిపాడు. అయితే ఇప్డుడు మరో భారత ఫస్ట్‌క్లాస్ క్రికెటర్ మనన్ శర్మ కూడా భారత క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించాడు. తనకు విదేశీ లీగ్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయని.. అందుకే భారత క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. త్వరలోనే యూఎస్ మేజర్ క్రికెట్ లీగ్ ఆడేందుకు కాలిఫోర్నియా వెళుతున్నట్టు అతని చెప్పాడు.
2017లో ఢిల్లీ తరపున భారత క్రికెట్లోకి అడుగుపెట్టిన మనన్ శర్మ 35 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 1208 పరుగులు, ఒక సెంచరీ, 8 అర్థసెంచరీలు, సాధించాడు. 113 వికెట్లు తీశాడు. ఇక లిస్ట్ ఏ క్రికెట్లో 560 పరుగులు చేశాడు . 26 టీ20 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 32 వికెట్లు తీశాడు. ఇక మనన్ శర్మను ఐపీఎల్ లో కేకేఆర్ జట్టులో కొనసాగాడు. ఇలా విదేశీ లీగ్ ల కోసం యువ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటిస్తుండడం కొంత ఆందోళన కలిగించేదే!