Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : దేశంలో జనవరి నుంచి పర్యాటక రంగాన్ని పునః ప్రారంభించాలని అనుకుంటున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ర్ట పండుగలైన బతుకమ్మ, సమ్మక్క-సారక్క జాతరలకు గుర్తింపు తెస్తామని చెప్పారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాద యాత్ర మూడోరోజు సాగుతోంది. యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న మంత్రి అనంతరం ఆలయ పునర్నిర్మాణాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బతుకమ్మ, బోనాలు, వినాయక చవితి, మేడారం జాతరలను చిత్రీకరించి దేశ వ్యాప్తంగా చూపించబోతున్నామని తెలిపారు. తెలంగాణతో పాటు ప్రతి రాష్ట్రంలోని పండుగలను గుర్తిస్తామన్నారు. ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా చేస్తున్నామని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఆర్గానిక్ వ్యవసాయం చేసేలా ప్రోత్సహిస్తున్నామన్నారు. బతుకమ్మ, గిరిజన పండగలు, సమ్మక్క-సారక్క జాతరలను స్పాట్లను వచ్చే రెండేండ్లలో టూరిజం స్పాట్లుగా చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి భువనగిరి కోటను కూడా అభివృద్ధి చేస్తామని చెప్పారు. హుజురాబాద్ లాంటి ఎన్నికలు గతంలో ఎక్కడా చూడలేదన్నారు.