Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీజేపీ పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కా సుమన్ విరుచుకుపడ్డారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ దేశాన్ని హోల్ సేల్‌గా అమ్మేస్తోందన్నారు. బీజేపీ అంటేనే అమ్మకం, టీఆర్ఎస్ అంటే నమ్మకం అని అన్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఏమైనా ఉంటే ప్రజలకు ఏం చేస్తారో చెప్పాలన్నారు. కుటుంబ పాలన, వారసత్వాల గురించి బీజేపీ మాట్లాడితే నవ్వొస్తోందన్నారు. బీజేపీ సీనియర్ నేతల కుటుంబ సభ్యులంతా ప్రస్తుతం పదవుల్లో ఉన్నారని తెలిపారు. టీఆర్ఎస్ సంపద సృష్టించి పేదలకు పంచుతోందని ఆయన చెప్పారు. ఈటల రాజేందర్ అసలెందుకు రాజీనామా చేశారో, గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారో అవి చెప్పాలన్నారు. అంతేకాని కేసీఆర్ ను విమర్శించడం తగదన్నారు. ఆయన పార్టీ కి వెన్పుపోటు పొడిచే రకం అని అన్నారు.