Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: కరీంనగర్లో ఒకే కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు. యశోద కృష్ణ ఆస్పత్రిలో నికిత అనే మహిళ ఓకే కాన్పులో ఇద్దరు పాపలు, ఇద్దరు బాబులకు జన్మనిచ్చారు. ఒకేసారి నలుగురు పిల్లల్ని చూసి పేరెంట్స్ నికిత, సాయి కిరణ్ ఆనందంలో ఉన్నారు. నలుగురు పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్లు తెలిపారు. అంతేకాదు నాలుగు నెలల క్రితం నికిత అక్క లిఖితకు కూడా ఓకే కాన్పులో ముగ్గురు కవల పిల్లలు జన్మించడం విశేషం. ఇద్దరు అక్కా చెల్లెళ్ళకు ఏడుగురు సంతానం కావడంతో కుటుంబసభ్యులు, బంధువులు సంతోషంలో ఉన్నారు.