Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఐదు సార్లు ఎమ్మెల్యే గా గెలిచి, పార్టీ రాష్ట్ర స్థాయి నేతగా ఎదిగినా సీపీఐ (ఎంఎల్) నేత గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర త్వరలో తెరపైకి రానుంది. ఆ చిత్రానికి పరమేశ్వర్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల కారు బోల్తా పడగా ప్రమాదం నుంచి బయటపడిన గుమ్మడి నర్సయ్యను ఆయన శుక్రవారం ఇల్లెందులో పరామర్శించారు. ఈ సందర్భంగా యూనిట్ సభ్యుడు కృష్ణతో కలిసి దర్శకుడు మాట్లాడారు. గుమ్మడి నర్సయ్య సినిమా షూటింగ్‌ను వచ్చే నెలలో ప్రారంభిస్తామని తెలిపారు. ఈ చిత్రం పోస్టర్ విడుదల చేసినప్పటి నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. అలాగే బెదిరింపులు కూడా వస్తున్నాయని చెప్పారు. అయితే, ఎవరికీ భయపడకుండా ఉన్నది ఉన్నట్టుగా ఆయన జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తామని తెలిపారు.