Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మనవరాలి కోసం ఓ వృద్ధ జంట ఓ చిరుత పులితో పోరాడారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని షియోపూర్ జిల్లాలో కర్హల్ పట్టణ సమీపంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. పట్టణానికి సమీపంలోని దుర గ్రామానికి చెందిన జై సింగ్ గుజర్, బసంతి బాయి భార్యభర్తలు. గురువారం రాత్రి వారు తమ మనవరాలు బాబీతో కలిసి ఇంట్లో నేలపై పడుకున్నారు. అర్థరాత్రి సమయంలో బసంతి నిద్రలేచి బాబీ కోసం చూసింది. కానీ అక్కడ బాబీ లేదు. ఓ చిరుతపులి బాబీ కాలును నోటితో కరుచుకుని లాక్కుపోవటం చూసి చూసింది. వెంటనే వెళ్లి పులిపై దాడి చేసింది. అనంతరం గట్టిగా అరిచింది. దాంతోఆమె అరుపులు విన్న ఆమె భర్త నిద్రలేచి పులి మీద దాడి చేయటం మొదలుపెట్టాడు. ఇద్దరూ చిరుత పులి మూతి, నోటిపై కొడుతూ బాబిని దాని నోటినుంచి బయటకు లాగారు. దాంతో చిరుత బాబిని విడిచిపెట్టి దంపతులపై దాడికి దిగింది. దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారు అరవడంతో స్థానికులు కర్రలు, ఆయుధాలతో అక్కడికి వచ్చారు. దాంతో భయపడిపోయిన చిరుత అడవిలోకి పారిపోయింది. మనవరాలి కోసం పోరాడిన వృద్ధ జంటను అందరూ అభినందించారు.