Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ఎమ్మెల్యే పదవికి, ఇతర పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కోల్పోయిన పదవిలోకి మంత్రి హరీశ్ రావు ఎంటర్ అయ్యారు. నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎగ్జిబిషన్ సొసైటీ యాజమాన్య కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది.. తమ విన్నపాన్ని మన్నించి అధ్యక్షుడిగా ఉండేందుకు అంగీకరించినందుకు మంత్రి హరీశ్ రావును కమిటీ సభ్యులు ఆయన నివాసంలో కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ సొసైటీని మరింత ముందుకు తీసుకెళ్తానని అన్నారు. అందుకు శక్తివంచన లేకుండా పని చేస్తానని తెలిపారు. గత 80 ఏండ్లుగా ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ను ఘనంగా నిర్వహిస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో నుమాయిష్ ను విశ్వవ్యాప్తంగా గుర్తింపు పొందేలా కలిసి పని చేద్దామన్నారు. సొసైటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, వృత్తి నైపుణ్యం మెరుగుపడి ఉపాధి అవకాశాలు పొందేలా చేద్దామన్నారు.