Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో చేతి (కాంగ్రెస్ పార్టీ) దెబ్బకు కారు (టీఆర్ఎస్), పువ్వు (బీజేపీ) పల్టీ కొట్టాల్సిందేనని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ అన్నారు. శనివారం యూత్ కాంగ్రెస్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. యూత్ కాంగ్రెస్ నేతలు.. ధరల పెరుగుదలపై, నిరుద్యోగ సమస్యలపై పోరాటం చేస్తున్నారని అలాగే తెలంగాణలో జరుగుతున్న కేసీఆర్ అవినీతి అక్రమాలపై కూడా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కేవలం దళిత బంధే కాదు బీసీ బంధు, మైనార్టీ బంధు కూడా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మతతత్వ పార్టీ అని అన్నారు. యూత్ కాంగ్రెస్ నేతలకు స్థానిక సంస్థల్లో, అసెంబ్లీ నియోజక వర్గాల్లో సీట్లు వచ్చేలా చూస్తామని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని.. అందుకోసం కష్టపడి పనిచేయాలని ఆయన కోరారు.