Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అహ్మదాబాద్: గుజరాత్‌లోని కచ్ జిల్లాల్లో శనివారం భూమి కంపించింది. రిక్టర్ స్కేల్‌పై 4.1 తీవ్రతతో భూమి కంపించిందని, ధోలవీరా సమీపంలో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఇన్స్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్ (ఐఎస్ఆర్) పేర్కొంది. భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. శనివారం మధ్యాహ్నం 12.08గంటలకు ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. ధోలావీరాకు తూర్పు – ఆగ్నేయంలో 23కిలోమీటర్ల దూరంలో, భూమికి 6.1 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం గుర్తించినట్లు ఐఎస్ఆర్ పేర్కొంది. ఇందుకు ఈ నెల 4న కచ్ జిల్లాల్లో భూమి కంపించింది. గుజరాత్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం.. కచ్ జిల్లా అధిక భూపంక రిస్క్ జోన్లో ఉంది. 2001, జనవరిలో 6.9 తీవ్రతతో భూమి కంపించగా.. తీవ్ర నష్టం కలిగింది.