Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : భర్తతో గొడవపడి ఓ ఎమ్మెల్యే అర్ధరాత్రి ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. సల్టోరా నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే చందన బౌరి... రోజువారీ కూలీ. అయితే ఎన్నికల తదనంతర పరిస్థితుల నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యేలకు బెంగాల్లో ప్రాణ హాని ఉందని భావించిన కేంద్ర ప్రభుత్వం వారికి ప్రత్యేక సెక్యూరిటీ సిబ్బందిని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల ఆమెకు, భర్తకు మధ్య గొడవలయ్యాయి. దాంతో ఆమె అర్థరాత్రి 2.45 సమయంలో ఎవరికీ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దాంతో ఒక్కసారిగా భద్రతా సిబ్బంది ఆందోళ చెందారు. ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకపోవడంతో ఆమె భర్త, భద్రతా సిబ్బంది గాలింపు చేపట్టారు. చివరికి గంగాజల్ఘాటి పోలీస్ స్టేషన్లో తాను ఉన్నట్టు ఎమ్మెల్యే తన భద్రతా సిబ్బందికి ఫోన్ చేశారు. తాను ఇలా చెప్పపెట్టకుండా రావడానికి తన భర్తే కారణమని అన్నారు. దాంతో ఆమె భర్త, అధికారులు అక్కడికి వెళ్లి ఎమ్మెల్యేకు సర్దిచెప్పారు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లింది.