Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే కేసును విచారిస్తున్న సీబీఐ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఈ కేసులో కీలక సమాచారం అందించిన వారికి రూ. 5 లక్షల రివార్డు ఇస్తామని తెలిపింది. ఈ మేరకు ఒక పేపర్ ప్రకటన చేసింది సీబీఐ. అయితే అది కచ్చితమైన, నమ్మదగినదిగా ఉండాలని స్పష్టం చేసింది. అలా ఉంటే రూ.5లక్షలు అందిస్తామని చెప్పింది. ఫోన్ నెంబర్ల ద్వారా గానీ ఆఫీసులో గానీ తమను సంప్రదించవచ్చని తెలిపింది. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయని పేర్కొంది.