Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : త్రిపుర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పిజుష్ కాంతి బిశ్వాస్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి, పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీకి పంపించినట్టు తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. దీనీపై బీజేపీ నాయకుడు నాబెందు భట్టాచర్య స్పందిస్తూ అది కాంగ్రెస్ పార్టీ అంశమని తాను దాని గురించి ఏమీ చెప్పలేనన్నారు. అలాగే టీఎంసీ నాయకులు కూడా దీనిపై స్పందించలేదు