Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. గడిచిన 24 గంటల్లో అక్కడ కొత్తగా 1,217 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే కరోనాతో 13 మంది మృతి చెందగా..1,535 మంది కోలుకున్నారు. ఇంకా 15,141 యాక్టివ్ కేసులున్నాయి. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఏపీలో మొత్తం పాజిటివ్ కేసులు 20,01,255కు పెరిగాయి. అలాగే మొత్తం 19,72,399 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం మరణాలు 13,715కు చేరాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 61,678 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.