Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : గోవాలో రష్యా దేశానికి చెందిన ఇద్దరు మహిళలు రెండు వరుస రోజుల్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందడంతో అక్కడ కలకలం రేగింది.. గురువారం అలెగ్జాండ్రా డ్జావీ (24) అనే రష్యా మహిళ తన అద్దె ఇంట్లో ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఆ మరుసటి రోజు శుక్రవారం అదే దేశానికి చెందిన మరో మహిళ ఎకాటెర్నియా టిటోవా (34) ఓ అపార్టుమెంట్‌లోని తన అద్దె ప్లాట్ బెడ్రూమ్లో విగతజీవిగా పడివున్నది. ఈ రెండు ఘటనలు కూడా నార్త్ గోవాలోని సియోలిమ్ గ్రామంలో చోటుచేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ ఇద్దరి మరణాలకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. పోస్టుమార్టం నివేదిక వస్తే దర్యాప్తులో పురోగతి కనిపించే అవకాశం ఉందని చెప్పారు. అయితే, అలెగ్జాండ్రా డ్జావీ కొందరు తనను బ్లాక్మెయిల్ చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని 2019లో చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసిందని.. ఆ కేసుకు, ఈ మరణాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు. అయితే రష్యన్ ఎంబసీ ప్రతినిధులను ఏర్పాటు చేసాకే మృతుల పోస్టు మార్టం జరుగుతందని చెప్పారు. ప్రస్తుతం రెండు మృతదేహాలను గోవాలోని మెడికల్ కాలేజీలో ఉంచారు.