Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించిన తాలిబన్లు త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వారు తొలి ఫత్వాను జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రయివేటు యూనివర్సిటీల్లో కో-ఎడ్యుకేషన్ ఉండకూడదని ఆప్ఘనిస్ధాన్లోని హెరత్ ప్రావియన్స్లో తాలిబన్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. యూనివర్సిటీ లెక్చరర్లు, ప్రయివేటు విద్యాసంస్ధల యజమానులతో తాలిబన్లు 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం కో ఎడ్యుకేషన్ విధానాన్ని నిలిపివేయాలని తాలిబన్ లు స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వ యూనివర్సిటీలు, విద్యా సంస్ధల్లో విద్యార్ధినీ, విద్యార్ధులు ఎక్కువగానే ఉంటారు కాబట్టి వేర్వేరుగా తరగతులు నిర్వహించే వెసులుబాటు ఉంటుంది కానీ ప్రభుత్వం విద్యాసంస్ధల్లో విద్యార్ధినుల సంఖ్య తక్కువగా ఉండటంతో వారికి ప్రత్యేకంగా తరగతులు నిర్వహించడం ఆయా సంస్ధలకు భారమవుతుందని లెక్చరర్లు అభిప్రాయపడ్డారు. అయితే సమాజంలో అన్ని అనర్ధాలకు కారణమైన కో ఎడ్యుకేషన్ ను రద్దు చేయాలని తాలిబన్ల తరపున హాజరైన ఆప్ఘనిస్ధాన్ ఇస్లామిక్ ఎమిరేట్, ఉన్నత విద్య చీఫ్ ముల్లా ఫరీద్ స్పష్టం చేశారు. అలాగే విద్యార్ధినులకు మహిళా లెక్చరర్లు, వయసు మీరిన లెక్చరర్లతో బోధన సాగించాలని సూచించారు. ప్రావియన్స్లో మొత్తం యూనివర్సిటీలలో, ఇన్ స్టిట్యూట్ లలో 40,000 మంది విద్యార్థులు, 2000 మంది లెక్చరర్లు ఉన్నట్టు సమాచారం.