Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాను కేంద్ర మంత్రి అయినందుకు తనకు సంతోషం లేదని అంబర్‌పేటకు దూరమయ్యానని బాధగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన చేపట్టిన జన ఆశీర్వాదయాత్ర శనివారం హైదరాబాద్‌లోని అంబర్‌పేటకు చేరుకుంది. ఈ సందర్బంగా ఆయన అంబర్పేట్ నియోజకవర్గ ప్రజలను చూసి భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మాట్లాడుతూ అంబర్‌పేటకు వస్తే చాలా రోజుల తర్వాత బిడ్డ తన తల్లి దగ్గరికి వచ్చినట్టు ఉందన్నారు. దేశానికి రాజైనా అంబర్ పేటకు బిడ్డనే అన్నారు. అంబర్ పేట ప్రజలు తన ప్రాణమన్నారు. తాను ఢిల్లీలో ఉన్నానంటే కారణం అంబర్‌పేట ప్రజలు, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలని గుర్తుచేశారు. . దేశానికి మంత్రినైనా అంబర్‌పేటకు ముద్దు బిడ్డనేనని కిషన్‌రెడ్డి అన్నారు. అందరూ గర్వపడే విధంగా పనిచేస్తానన్నారు.