Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వివాహితుడితో అక్రమ సంబంధం నెరుపుతోందని మహిళపై దాడి చేసి నగ్నంగా ఊరేగించిన దారుణ ఘటన జార్ఖండ్‌లోని దంకా జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఉదంతంలో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. రణీశ్వర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన వివాహిత వేరొకరితో కొద్దిరోజుల కిందట వెళ్లిపోయింది. వివాహిత సన్నిహితంగా ఉంటున్న వ్యక్తి భార్య బుధవారం రాత్రి మహిళను గుర్తించి ఆమెపై దాడికి తెగబడింది. మరికొందరితో కలిసి ఆమె బాధిత మహిళను తీవ్రంగా కొట్టి ఆమె మెడ చుట్టూ చెప్పుల దండ వేసి నగ్నంగా ఊరేగించింది. నిందితురాలు తన నుంచి రూ 25,000 గుంజుకుందని కూడా బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనకు సంబంధించి వివాహితుడు, ఆయన భార్య సహా 12 మందిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. ఇప్పటివరకూ ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.