Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం చోటుచేసుకుంది. కట్నం కోసం కట్టుకున్న భార్యకు ఓ భర్త, అతని కుటుంబ సభ్యులు యాసిడ్ తాగించారు. దాంతో ఆమె మృతి చెందింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. శశి(22) అనే మహిళకు గ్వాలియర్‌లోని డాబ్రా కు చెందిన వీరేంద్ర జాతవ్తో వివాహం జరిగింది. అతనికి పెండ్లప్పుడు 10 లక్షలు కట్నం ఇచ్చారు. అయితే జూన్ 27న ఆమె తండ్రి నుంచి రూ.3 లక్షల కట్నం ఇంకా తీసుకురావాలని భార్యను భర్త డిమాండ్ చేశాడు. అందుకు భార్య నిరాకరించడంతో వీరేంద్ర, అతని తల్లి, సోదరి కలిసి ఆమెతో బలవంతంగా యాసిడ్ తాగించారు. యాసిడ్ తాగించిన శశిని గ్వాలియర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఢిల్లీలోని ఆస్పతిరకి తరలించారు. అక్కడ 50 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన ఆమె చివరకు గురువారం చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మృతి చెందింది. అయితే జరిగిన విషయాన్ని బాధితురాలు వీడియో రికార్డ్ చేసింది. నిందితులైన భర్త, అత్త, ఆడపడుచును వదిలిపెట్టవద్దని పోలీసులను శశి కోరింది. దాంతో ఈ కేసులో హత్య సెక్షన్‌ను కూడా కలిపి నిందితులను అరెస్ట్ చేసినట్టు గ్వాలియర్ ఎస్పీ అమిత్ సంఘీ తెలిపారు. తొలుత దర్యాప్తు సరిగా చేయని ఎస్ఐని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. మరోవైపు ఈ కేసులో తగిన చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్ సీఎంను జాతీయ మహిళా కమిషన్ చైర్మెన్ స్వాతి కోరింది.