Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మహబూబాబాద్ కు చెందిన ఓ వ్యక్తి నుంచి 18 లక్షల 50 వేలు కొట్టేశారు కేటుగాళ్లు. ఎలాంటి సమస్యలైనా రెండు గంటల్లో పరిష్కారం చేస్తాం, సమస్య పరిష్కారం కాకపోతే మీ డబ్బులు మీకు వాపస్ ఇస్తామని టీవీలో వచ్చిన ఓ ప్రకటన చూశాడు మహబూబాబాద్ కు చెందిన ఎండీ రజాక్. ప్రకటనలో ఉన్న నంబర్ కు ఫోన్ చేసి తన బాధ చెప్పుకున్నాడు. తన దగ్గర డబ్బులు అప్పుగా తీసుకున్నవాళ్లు ఇవ్వడం లేదని ... ఆ డబ్బులు వచ్చేలా సాయం చేయాలని కోరాడు. అవతలివాళ్లు ఫోన్ నంబర్ డబ్బులు పంపమని చెప్పడంతో ముందు11 వేలు పంపాడు. సమస్య పరిష్కారం కాకపోడంతో మళ్లీ ఫోన్ చేస్తే పూజకు ఆటంకం జరిగింది... మరికొన్ని డబ్బులు పంపమని చెప్పారు. ఇలా విడతల వారీగా 18 లక్షల 50 వేల పంపాడు రజాక్. అయినా పరిష్కారం సమస్య పరిష్కారం కాకపోవడంతో మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. టీ స్టాల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు రజాక్. తన డబ్బులు తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరాడు.