Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇద్దరు నాయకులపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం కన్నెర్ర చేసింది. టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి టి.నిరంజన్, టీపీసీసీ మాజీ కార్యదర్శి ఘంటా సత్యనారాయణ రెడ్డిలకు క్రమశిక్షణా సంఘం శనివారం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల లోపు వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. ఇటీవల ఆత్మగౌరవ దండోరా సభల విషయంలో నాయకత్వంపైన అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వెంటనే సానుకూల వివరణ ఇవ్వకపోతే క్రమశిక్షణ సంఘం చర్యలు తీసుకుంటుందని నోటీసులో పేర్కొన్నారు.