Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దిశ కమిషన్ విచారణను వేగవంతం చేసింది. కమిషన్ ముందు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా హాజరయ్యారు. వర్చువల్ మీటింగ్ ద్వారా జుడీషియల్ కమిషన్ విచారణ చేపట్టింది. రవిగుప్తా కమిషన్ కార్యాలయానికి హాజరై ప్రభుత్వ వివరణ ఇచ్చారు. ఈ నెల 26న బాధిత, నిందితుల కుటుంబాలు హాజరు కావాలని కమిషన్ ఆదేశించింది. ఇప్పటికే సిట్ రీపోర్ట్ను కమిషన్కు సిట్ చీఫ్ మహేష్ భగవత్ అందించారు.