Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 30,948 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. తాజాగా 38,487 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 403 మంది వైరస్ ప్రభావంతో మృత్యువాతపడ్డారు. కొత్త కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,24,24,234 కు పెరిగింది. ఇందులో 3,16,36,469 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసులు 3,53,398 ఉన్నాయి. వైరస్ బారినపడి ఇప్పటి వరకు 4,34,367 మంది ప్రాణాలు కోల్పోయారు. టీకా డ్రైవ్లో భాగంగా 58,14,89,377 డోసులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది. ఇదిలా ఉండగా నిన్న ఒకే రోజు 15,85,681 కొవిడ్ శాంపిల్స్ పరీక్షించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. మొత్తం 50,62,56,239 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.