Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: దివ్యాంగ జంటకు సాయి సంస్థాన్‌లో వివాహం జరిపించారు. దివ్యాంగులైన బి.సత్యనారాయణ, శోభ అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షులు కొల్లి నాగేశ్వరరావును సంప్రదించారు. ఆయన విషయాన్ని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యే సూచన మేరకు దిల్సుఖ్నగర్ శ్రీషిర్డి సాయి సంస్థాన్ ట్రస్ట్ సభ్యులు ఉచితంగా వివాహం జరిపించేందుకు ముందుకు వచ్చారు. సంస్థాన్ ట్రస్ట్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గుండా మల్లయ్య బంగారు పుస్తె మెట్టలు అందజేయగా, ఓల్లూరు శ్రీనివాస్ దంపతులు రూ.11వేలు అందజేశారు. సంస్థాన్ ట్రస్ట్ చైర్మన్ బచ్చు గంగాధర్, అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గుండా మల్లయ్య దంపతులు, ఉపాధ్యక్షుడు వూర నర్సింహగుప్తా, నాగేశ్వరరావులు నూతన జంటను ఆశీర్వదించారు.