Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: ప్రేమించిన ప్రియురాలితో పాటు.. స్నేహితుడు మోసం చేశారని మనస్తాపానికి గురైన వ్యక్తి హైదరాబాద్‌కు వచ్చి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. ప్రకాశం జిల్లా పసుపుగల్లుకు చెందిన షేక్బ్రహ్మం వివాహం 13 ఏళ్ల క్రితం జరిగింది. అతనికి భార్యతోపాటు.. కొడుకు కూతురు ఉన్నారు. సొంతంగా ఉన్న కొన్ని లారీలతో ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేసేవాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులు వచ్చి వాటిని అమ్మేశాడు. ఇదిలా ఉండగా.. బ్రహ్మం ఓ యువతి ప్రేమలో పడ్డాడు. ఆమెకోసమే హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రేమించిన యువతితోపాటు తన స్నేహితుడు కూడా తనను మోసం చేసినట్లు తెలుసుకున్న బ్రహ్మం మనస్తాపానికి గురయ్యాడు.
వనస్థలిపురంలోని వీఎంఆర్ గార్డెన్స్‌లో శనివారం ఉదయం గదిని అద్దెకు తీసుకున్నాడు. అమ్మాయితోపాటు.. స్నేహితుడు మోసం చేశాడని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంటూ బ్రహ్మం సెల్ఫీ వీడియో తీశాడు. తల్లికి, భార్యకు సారీ చెప్పాడు. అనంతరం గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. అతను ప్రేమించిన అమ్మాయి ఎవరు.. స్నేహితుడు ఎవరు.. వారు ఎందుకు మోసం చేశారనేది వీడియోలో తెలియజేయలేదు. అతని కుటుంబ సభ్యులకు పోలీసులు ఇచ్చిన సమాచారం ఇచ్చి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వారు వస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.