Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్ లో దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఆ దేశం ఇప్పుడు తాలిబన్ ఫైటర్ల చేతుల్లోకి వెళ్లింది. అరాచక పాలనలో జీవించలేక పలువురు దేశాన్ని వీడుతున్నారు. కాబూల్ నుంచి భారత వైమానిక దళానికి చెందిన -17 విమానంలో 168 మంది భారత్‌కు చేరుకున్నారు. ఇవాళ ఉదయం కాబూల్‌లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి బయలు దేరిన విమానం ఘజియాబాద్‌లోని హిండన్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ల్యాండ్ అయ్యింది. విమానంలో 107 మంది భారతీయులతో సహా 168 మంది ఉన్నారు. ఇప్పటికే ఐఏఎఫ్ రెండు C-17 విమానంలో భారత రాయబార కార్యాలయ సిబ్బందితో సహా 200 మందిని భారత్ ఇప్పటికే తరలించింది. మొదట సోమవారం 40 మందిని, రెండో విడుతలో భారతీయ దౌత్యవేత్తలు, అధికారులు, భద్రతా సిబ్బంది సహా 150 మందిని తరలించిన విషయం తెలిసిందే.