Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈ రోజు ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. ఆదివారం రాత్రి బ్లూమూన్ కనిపించనున్నట్టు అమెరికన్ ఆస్ట్రోనామికల్ సొసైటీ తెలిపింది. భారత్ లో ఈ అద్భుతాన్ని అర్ధరాత్రి 12 గంటల సమయంలో చూడొచ్చు. తర్వాతి బ్లూమూన్ 2023, ఆగస్ట్‌లో కనిపించనుంది.
ఒక సీజన్లో సాధారణంగా మూడు పౌర్ణములు ఉంటాయి. అయితే నాలుగు పౌర్ణములు ఉండే సీజన్లో వచ్చే మూడో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. నాసా ప్రకారం.. రెండు రకాల బ్లూమూన్స్ ఉంటాయి. ఒకటి నెలవారీగా, మరొకటి సీజనల్‌గా వస్తుంది. ఒక కేలండర్ నెలలో రెండు పౌర్ణములు వస్తే.. అందులో రెండో పౌర్ణమిని బ్లూమూన్ అంటారు. ఒక ఆస్ట్రానామికల్ సీజన్లో ఒకవేళ నాలుగు పౌర్ణములు వస్తే అందులో వచ్చే మూడో పౌర్ణమిని సీజనల్ బ్లూమూన్ అంటారు. అయితే చంద్రుడు నీలి రంగులో కనిపించడం మాత్రం అత్యంత అరుదు.అగ్నిపర్వతాలు పేలినప్పుడు లేదా అడవుల్లో కార్చిచ్చు రగిలినప్పుడు భారీ ఎత్తున పొగ, దుమ్ముదూళి వాతావరణంలోకి వెళ్లినప్పుడు చంద్రుడు నీలి రంగులో కనిపిస్తాడు.