Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అప్పు తిరిగి చెల్లించమన్నందుకు ఓ వ్యాపారవేత్తను అతని ముగ్గురు స్నేహితులు కలిసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన సంగారెడ్డిలో చోటుచేసుకుంది. ప్రస్తుతం పోలీసులు ఒక నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ లోని చార్మినార్ కు చెందిన మధుసూదన్ రెడ్డి వద్ద అతని ముగ్గురు స్నేహితులు రూ. 40 లక్షలు అప్పుగా తీసుకున్నారు. ఈ నెల 19న డబ్బులు తిరిగి ఇవ్వాలని మధుసూదన్ అడగగా అతన్ని ముగ్గురు స్నేహితులు కలిసి కిడ్నాప్ చేసి సంగారెడ్డికి తీసుకెళ్లారు. అనంతరం అతన్ని హత్య చేసి పూడ్చిపెట్టారు.
మరో వైపు మధుసూదన్ రెడ్డి కనపించకపోవడంతో అతని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా 19వ తేదీ రాత్రే మధుసూదన్ రెడ్డిని హత్య చేసి దిగ్వాల్ వద్ద పాతిపెట్టినట్టు నిందితులు ఒప్పుకున్నారు. పూడ్చిన ప్రదేశాన్ని వారు చూపించడంతో పోలీసులు.. మధుసూదన్ రెడ్డి మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రస్తుతం పోలీసులు అదుపులో ఒక నిందితుడు ఉండగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.