Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అత్తింటివారు వేధిస్తున్నారని ఓ యువకుడు వాయిస్ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దేశాయిపల్లికి చెందిన తుత్తూరు ప్రదీప్(25)కు అతని భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. అయితే వారి వేధింపులు భరించలేక ఈ నెల 19న బంధంపల్లికి ప్రదీప్ వచ్చాడు. తన చావుకు భార్యతో పాటు ఆమె తరుఫు బంధువులే కారణమని వాయిస్ రికార్డు చేసి తన తండ్రి నగేష్‌కు పంపాడు. అనంతరం గడ్డిమందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు చేరుకుని హన్మకొండలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి శనివారం అతను మృతి చెందాడు. మృతుని తండ్రి నగేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ట్రెయినీ ఎస్సై మహేందర్ తెలిపారు.