Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఈటెల అక్రమాల పై ఇద్దరు స్పెషల్ ఆఫీసర్ల తో వేసిన టీం ఏం చేస్తున్నదని ఎంపీ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన తరువాత ఆయన పై విచా రణ జరిగిందా ..? అని అన్నారు. కేసీఆర్ దత్తత తీసుకున్న మూడు చింతలపల్లి గ్రామాన్ని ఏం అభివృద్ధి చేయలేదని.. అలాంటి ది తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తాడని ప్రశ్నించారు. మూడు చింతలపల్లిలో దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష పెట్టనున్నామని తెలిపారు. ఈ దీక్ష తో కెసిఆర్ గ్రామానికి ఎం చేశాడో ప్రజలకి చూపి స్తామన్నారు. అలాగే దీక్ష సమయంలో రాత్రి తాను దళితుల ఇంట్లోనే పడుకుంటానని తెలిపారు. కాంగ్రెస్ హుజురాబాద్ అభ్యర్థి ఎంపిక దామోదర రాజనరసింహ కమిటీ చూసుకుంటుందని ఈ సందర్భంగా చెప్పారు.