Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తనకు బ్రేకప్ చెప్పిందన్న కోపంతో ఓ యువకుడు అతని ప్రియురాలి నగ్న వీడియోలు, ఫోటోలను ఇంటర్నెట్ లో పెట్టించాడు. ఈ ఘటన విజయవాడలో చోటు చేసుకుంది.
పూర్తి వివరాల్లోకెళ్తే.. విజయవాడలోని ఓ కళాశాలలో ఓ యువతి డిగ్రీ చదువుతోంది. ఆమెకు అదే కాలేజీలో చదువుతున్న రోహిత్ పరిచయమయ్యాడు. కొన్ని రోజులకు ఆమెను ప్రేమిస్తున్నానని రోహిత్.. ఆమెకు చెప్పాడు. ఆమె కూడా అతని ప్రేమను అంగీకరించింది. ఈ క్రమంలో ఆమె తన నగ్నవీడియోలు, ఫోటోలను రోహిత్ కు పంపింది. అయితే ఇటీవల ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు రావడంతో యువతి.. రోహిత్ కు బ్రేకప్ చెప్పింది. దాంతో రోహిత్ ఆమెపై పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఆమెకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు, వీడియోలను తన ఫ్రెండ్ దండగల గణేష్ కు షేర్ చేశాడు. అతడు ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫేక్ ఎకౌంట్ క్రియేట్ చేసి యువతి ఫోటోలు, వీడియోలను అందులో షేర్ చేశాడు. విషయం తెలుసుకున్న బాధిత యువతి ఒక్కసారిగా షాక్ అయింది. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. దాంతో పోలీసులు.. రోహిత్ తో పాటు అతడి స్నేహితుడు గణేష్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.