Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : బీజేపీ.. అంటే బిగ్ జోకర్స్ పార్టీగా మారిందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 28 మంది అవినీతిపరులను దేశం దాటించింది బీజేపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. పసువు బోర్డు తెస్తానని ఫేక్ బాండ్ పేపర్ రాసిచ్చిన ఫేక్ ఎంపీ అరవింద్ అని అన్నారు. అలాంటి అరవింద్‌కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కవిత, హరీశ్ రావుల గురించే మాట్లాడేస్థాయి లేదన్నారు. అరవింద్‌కు దమ్ముంటే మోడీతో మాట్లాడి పసుపు బోర్డు తెప్పించాలని సవాల్ చేశారు. ఒకే ఇంట్లో మూడు పార్టీలున్న అరవింద్.. ఇంట గెలవకుండా రచ్చ గెలుస్తారా? అని ప్రశ్నించారు. జైలుకెళ్లిన రేవంత్ కూడా అవినీతి గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.