Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: వీలైనంత త్వరగా 'మా' ఎన్నికలు జరపాలని నటుడు ప్రకాశ్‌రాజ్ కోరారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన 'మా' సర్వసభ్య సమావేశంలో ప్రకాశ్ రాజ్ పాల్గొన్నారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో 'మా'లోని కీలకసభ్యులు అసోసియేషన్ ఎన్నికలపై , 'మా'లోని సమస్యలు, ఇప్పటివరకూ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. కాగా, ఈ సమావేశంలో పాల్గొన్న ప్రకాశ్‌రాజ్ 'ఈ ఏడాది జరగాల్సిన 'మా' అసోసియేషన్ ఎన్నికలు త్వరితగతిన జరిగేలా చూడాలి. వీలైతే సెప్టెంబర్ 12 లేదా 19 తేదీల్లో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలి' అని కృష్ణంరాజుకి విజ్ఞప్తి చేశారు.