Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్ సింగ్ మృతి బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అన్నారు. కల్యాణ్‌సింగ్ కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. యూపీ సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న నేతను కోల్పోయిందన్నారు. కల్యాణ్‌సింగ్ ప్రజా సంక్షేమమే ద్వేయంగా పనిచేశారని చంద్రబాబు కొనియాడారు. కల్యాణ్ సింగ్ తీవ్ర అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచారు. ఆయన పార్ధివ దేహానికి అంత్యక్రియలు నరోరాలోని గంగా నది ఒడ్డున సోమవారం జరుగుతాయి.