Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పై సీనియర్ హీరో మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘మా’ భవనం కోసం రూపాయికి కొన్న స్థలాన్ని అర్థ రూపాయికి అమ్మేశారని ఆరోపించారు. ఆదివారం ‘మా' అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం వర్చువల్ గా నిర్వహించారు. అందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మా భవనం కోసం డబ్బు కూడబెట్టి, స్థలం కొని, మళ్లీ దాన్ని సగం ధరకు అమ్మేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. దానిపై ఎవరైనా మాట్లాడారా అని నిలదీశారు. దీనిపై పెద్దలు ఆలోచించాలని కోరారు.