Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుంటూరు: విద్యార్థిని రమ్య హత్య నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్చేశామని అర్బన్ ఎస్పీ అరిఫ్ హాఫిజ్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దిశ చట్టం ప్రకారం వారంరోజుల్లో ఛార్జ్‌షీట్ వేశామన్నారు. మరో కేసులో బాలికను వేధించిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశామని తెలిపారు. కానిస్టేబుల్ వేధింపుల ఘటనపై సోషల్‌మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, సున్నిత కేసుల అంశంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయం పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్థిక పరమైన నేరాలు జరుగుతున్నాయని చెప్పారు. విద్యాసంస్థలు ప్రారంభమైన దృష్ట్యా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశామని అరిఫ్ పేర్కొన్నారు.