Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కోడలిపై మామ లైంగికదాడి చేశాడు. కోపంతో రగిలిపోయిన కోడలు మామకు ఎలుకల మందు పెట్టి చంపింది. ఈ ఘటన తమిళనాడులోని కిజతువాల్ లో జరిగింది. కిజతువాల్ కు చెందిన వినోభరాజన్ కు నాలుగేళ్ల క్రితం 25 ఏళ్ల కనిమొళితో వివాహం జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల వారు సంతానాన్ని పొందలేకపోయారు. దీనిని కారణంగా చూపిస్తూ.. వినోభరాజన్ తండ్రి మురుగషన్ కోడలైన కనిమొళి మీద కన్నేశాడు. ఇంట్లో కొడుకు లేనప్పుడు.. ఒంటరిగా ఉన్న సమయంలో కోడలిపై పలుమార్లు లైంగికదాడి చేశాడు. మామ చేష్టలతో విసుగుచెందిన కనిమొళి.. జూలై 31న అన్నంలో ఎలుకల మందు కలిపి పెట్టింది. ఆ భోజనం తిన్న మురుగేషన్.. అనారోగ్యం పాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ.. ఆగష్టు 1న మురుగేషన్ మృతిచెందాడు. అతని మరణాన్ని అందరూ సాధారణంగానే భావించారు. వారి ఆచారాల ప్రకారం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే మామను చంపిన బాధతో.. తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిన కనిమొళి.. గ్రామ పాలనాధికారి హరికృష్ణ ముందు తన నేరాన్ని అంగీకరించింది. ఆయన ఫిర్యాదు ఆధారంగా.. కేసు నమోదు చేసిన కిజతువాల్ పోలీసులు కనిమొళిని అరెస్టు చేశారు.