Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సీఎం కేసీఆర్ దత్తత గ్రామాల్లో అభివృద్ధి శూన్యమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ దత్తత గ్రామం మూడుచింతలపల్లిలో త్వరలో దళిత, గిరిజన దీక్ష చేస్తున్నట్లు ప్రకటించారు. మూడుచింతలపల్లి దుస్థితిని సమాజానికి చూపిస్తామన్నారు. కేసీఆర్ వల్లే హుజురాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాజీమంత్రి ఈటల రాజేందర్ నిలబడ్డారని తెలిపారు. ఈటల అవినీతిపై కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు? అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్, బీజేపీవి కొనుగోలు రాజకీయాలని తప్పుబట్టారు. ఎస్సీలకు ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ అమలు చేయలేదని, ఆయన ఎస్సీలకు ఎంత సేవ చేసినా తక్కువేనన్నారు. కేసీఆర్ అరాచకాలతోనే ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ బయటికొచ్చారని తెలిపారు. పీసీసీ పూర్తిస్థాయి కమిటీకి ఇంకా సమయం ఉందని పేర్కొన్నారు. జగ్గారెడ్డి రాసిన లేఖలు తన దృష్టికి రాలేదని రేవంత్‌రెడ్డి తెలిపారు.