Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1085 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 8 మంది కరోనాతో మృతి చెందారు. కరోనా బాధితుల్లో 1541 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఆ రాష్ర్టంలో ప్రస్తుతం 14,677 యాక్టివ్ కేసులున్నాయి.
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసులు 20,02,340కు చేరగా మొత్తం 1973940 మంది కోలుకున్నారు. మొత్తం మరణాలు 13,723కు చేరాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 57,745 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.