Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : విజయవాడలో వ్యాపారి కరణం రాహుల్ హత్యకేసుకు సంబంధించి పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో ఏ1గా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ కుమార్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. కరణం రాహుల్ కారులో శవమై తేలిన తర్వాత నుంచి కోరాడ విజయ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు తీవ్ర గాలింపు చేపట్టారు. అయితే కేసు తీవ్రత దృష్ట్యా కోరాడ విజయ్ పోలీసులు ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. కోరాడ విజయ్ ను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్టు తెలుస్తోంది. రాహుల్ హత్యకేసులో పోలీసులు ఇప్పటికే పలువురిని ప్రశ్నించారు. వ్యాపారి రాహుల్ ఈ నెల 19న హత్యకు గురయ్యాడు. ఇంటి నుంచి బయటికి వచ్చిన ఆయన తిరిగి వెళ్లలేదు. దాంతో ఆయన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతలోనే రాహుల్ కారులో విగతజీవుడిగా కనిపించాడు. ఆయన హత్యకు గురైనట్టు గుర్తించారు. వ్యాపార లావాదేవీలే అందుకు కారణమని భావిస్తున్నారు. హంతకుల కోసం 5 పోలీసు బృందాలు తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టాయి.