Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తాలిబన్లు అఫ్ఘనిస్తాన్ ను దురాక్రమించడంతో చాలా మంది అక్కడి పౌరులు ఇతర దేశాలకు వెళ్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కాబుల్ విమానాశ్రయానికి భారీగా ప్రజలు చేరుకుంటున్నారు. అయితే అక్కడ జరుగుతున్న తొక్కిసలాటలో కొందరు చనిపోతున్నారు. తాజాగా ఆదివారం ఉదయం కూడా కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు చనిపోయారు. అయితే విమానాశ్రయం దగ్గర ఈ గందరగోళానికి కారణం అమెరికానే అని తాలిబన్ అధికారి అమీర్‌ఖాన్ ముతాఖి అన్నాడు. అతను మాట్లాడుతూ అంత అధికారం, శక్తిసామర్థ్యాలు, వసతులు ఉన్న అమెరికా ఎయిర్పోర్ట్ దగ్గర ఈ పరిస్థితులను నిలువరించలేకపోయిందన్నాడు. దేశం మొత్తం ప్రశాంతంగానే ఉంది కానీ కేవలం కాబూల్ ఎయిర్పోర్ట్ దగ్గరే ఈ గందరగోళం నెలకొన్నదన్నాడు.