Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ఆఫ్ఘన్ల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. తాలిబన్లకు భయపడి దేశాన్ని వీడి చెట్టుకొకరు, పుట్టకొకరుగా వెళ్లిపోతున్నారు. పిల్లాపాపలతో కొందరు, నిండు గర్భంతో మరికొందరు.. ఇల్లూవాకిలి వదిలేసి ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ఆఫ్ఘనిస్థాన్‌ను వీడుతున్నారు. అయితే ఇలా నిండు గర్భంతో ఉన్న ఓ మహిళ జర్మనీ వెళ్తున్న అమెరికా విమానంలో ప్రసవించింది. జర్మనీలోని రామ్‌స్టెయిన్ ఎయిర్‌బేస్‌కు వెళ్తున్న తమ విమానంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చినట్లు యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ తన ట్విటర్లో వెల్లడించింది. ఈ విమానం ల్యాండవగానే.. వైద్య సిబ్బంది విమానంలోకి వెళ్లి ఎయిర్‌క్రాఫ్ట్ కార్గో ప్రాంతంలో ఆ మహిళకు పురుడు పోశారు. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ క్షేమంగానే ఉన్నట్లు కూడా యూఎస్ ఎయిర్ మొబిలిటీ కమాండ్ తెలిపింది.