Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భద్రాచలం: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గత రెండు రోజులుగా క్రిమేపీ పెరుగుతోంది. రెండు రోజుల క్రితం 22.5 అడుగులున్న నది నీటిమట్టం శనివారం 25అడుగులుండగా, ఆదివారం 29.6అడుగులకు చేరుకుంది. వరద మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటిప్రవాహం పెరగడంతో భద్రాచలం వద్ద గోదావరి స్నానఘట్టాలు నీట మునిగాయి. దాంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశారు.