Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : రైలు నుంచి జారిపడి తల్లి, బిడ్డ మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి సమీపంలో జరిగింది. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన చందన (27) రెండేళ్ల కుమారుడితో కలిసి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని పుట్టింటికి రైల్లో బయల్దేరారు. శ్రీకాళహస్తి మండలం అక్కుర్తి సమీపంలోకి రాగానే రైలు నుంచి జారిపడి తల్లి బిడ్డ మృతి చెందారు. రైల్వే ట్రాక్‌పై తల్లి, బిడ్డ మృతదేహాలు ఉన్నట్టు స్థానికుల నుంచి సమాచారం రావడంతో రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే, ప్రమాదవశాత్తూ రైలు నుంచి జారి కింద పడిందా లేక ఆత్మహత్య చేసుకున్నారా? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రికి తరలించారు.